బాలీవుడ్ హాట్ భామ.. కరీనా కపూర్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లాడి ఒక బిడ్డను కూడా కనింది. బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా హవా చెలాయించిన కరీనా ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ తో పీకల్లోతు ప్రేమాయణాన్ని నడపింది. అతడితో బ్రేకప్ చెప్పాక సైఫ్ అలీ ఖాన్ కు దగ్గరయ్యింది. కాగా, ఈ నెల 21తో 38 వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది.. ఈ ముద్దుగుమ్మ.
తన బాబాయి కుమారుడు రణ్ బీర్ కపూర్ దేశంలోనే గొప్ప నటుల్లో ఒకడని, అతడితో కలసి నటించడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెబుతోంది. తామిద్దరు కోసం ఎవరైనా మంచి స్క్రిప్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించింది. రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ లకు హిందీ సినిమాను మరింత సమున్నత స్థాయికి తీసుకెళ్లగల సత్తా ఉందని కరీనా అభిప్రాయపడింది.
హత్యలతో కూడిన మిస్టరీస్, థ్రిల్లర్ సీరియల్స్ తనకు బాగా ఇష్టమని, ప్రతిరోజూ రెండు గంటలపాటు టీవీ షోలు చూస్తానని.. రాత్రి 10.30 గంటలకల్లా పడుకుంటానని అంటోంది. ఉదయాన త్వరగా లేచి వర్కవుట్లు చేస్తానని చెబుతోంది.. ఈ బ్యూటీ. సినిమాలను నిర్మించే ఉద్దేశం కానీ, దర్శకత్వం చేసే ఉద్దేశం కానీ తనకు లేవంది.
రోజులో ఎక్కువ భాగం తన కుటుంబానికి, స్నేహితులకే కేటాయిస్తానంటోంది. ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడం, ఇంటర్నెట్ చూడటం తన హాబీలు అని చెప్పింది. కాగా, ప్రస్తుతం కరీనా కపూర్.. తఖ్త్, గుడ్ న్యూస్ సినిమాల్లో నటించడానికి కరీనా అంగీకరించింది.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి