Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
తెలుగు ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటున్న మొట్టమొదట మూవీ సైరా. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ 150 కోట్ల బడ్జెట్. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిల్ మలయాళం హిందీలో కూడా రిలీజ్ చేయడానికి రామ్ చరణ్ బాగా కృషి చేస్తున్నాడు. పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్లని ఆట ఆడుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సైరా చిత్రాన్ని స్వయంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ కొణిదెల ప్రో కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్.. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణఃలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ క్రమలో సైరా షూటింగ్ సందర్భంగా మెగాస్టార్ జార్జియాలోనూ, మెగా పవర్ స్టార్ అజర్ బైజాన్ దేశంలోనూ ఉన్నారు.
రెండు దేశాలు పాత సోవియట్ రష్యాలోని దేశాలే కావడం, అందులోనూ పక్కపక్కనే ఉండటంతో మెగాస్టార్ జార్జియా వెళ్లేముందు తన కుమారుడు రామ్ చరణ్ షూటింగ్ సెట్ కు విచ్చేశారు. అక్కడ రామ్ చరణ్ సతీమణి ఉపాసనతోపాటు సైరా చిత్రానికి క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, ఆమె భర్త కూడా ఉన్నారు. దీంతో అందరూ కలసి ఎంతో సంతోషంగా డిన్నర్ చేశారు. అంతేకాకుండా అందరూ కలసి బ్లాక్ డ్రస్సుల్లో సందడి చేసి ఫొటోలు దిగారు.
ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమ కుటుంబంలో ఏ ఈవెంట్, చిన్న సంఘటన జరిగినా అటు ఫేస్ బుక్లోనూ, ఇటు ట్విట్టర్ లోనూ ఉపాసన పోస్టు చేస్తూ అభిమానులను ఆనందాన్ని పంచుతోంది. తాజాగా జరిగిన డిన్నర్ ను మావయ్యతో డిన్నర్ అంటూ ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఆర్సీ 12 షూటింగ్ సందర్భంగా మావయ్య ఇక్కడకు వచ్చారు. మాతో కలసి డిన్నర్ చేశారని తెలిపింది.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.