Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ టు రియాల్టీ షో చివరి దశకు చేరడంతో పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఇప్పటికే ఓట్లు కోట్ల సంఖ్యకు చేరడంతో ఇంకా పెరిగే సూచనలున్నాయని చెప్పక తప్పదు. అయితే ఏమాత్రం ఫెరఫార్మెన్స్ లేని వాళ్లకు ఈమధ్య తారాస్థాయిలో ఓటింగ్ నమోదవ్వడంతో ఫేక్ ఓట్లు పడుతున్నాయన్న అనుమానం బిగ్ బాస్ టీమ్ కి వచ్చింది. అందుకే ఫేక్ ఓట్లను గుర్తించే పనిలో బిగ్ బాస్ టీమ్ వేగంగా పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఫేక్ ఓట్లు వేసినవాళ్లు ఎవరు, ఎవరివి ఒరిజనల్ అనే విషయం తేలాలంటే,దీనిపై జరుగుతున్న కసరత్తు సహేతుకంగానే ఉందని అంటున్నారు.
ఒకే ఐపి ఎడ్రెస్ ఉన్నప్పటికీ ఎన్ని ఓట్లు అయినా వేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొత్తగా మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి, వాటినుంచి పంపినా, అందునా బల్క్ గా ఓట్లు వేస్తే, బిగ్ బాస్ టీమ్ వాటిని ఎలాంటి సంకోచం లేకుండా తొలగిస్తోందని అంటున్నారు. ఒక ఆఫీసులు మూడువేలమంది పనిచేస్తుంటే లక్షన్నర ఓట్ల కన్నా ఎక్కువ వేయడానికి ఉండదు. కానీ 12లక్షలు ఓట్లు పడితే అనుమానమే కదా. ముఖ్యంగా ఒకే అడ్రెస్ నుంచి లక్షల్లో ఓట్లు పడినట్లు అనిపిస్తే ఏమాత్రం ఉపేక్షించడం లేదని తెలుస్తోంది.
ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ డేగకన్నుతో పరిశీలన చేస్తోందని అంటున్నారు. అంతే కాదు ఒక ఏరియాలో అందరూ కూడి,బల్క్ గా ఆన్ లైన్ లో ఓట్లు వేస్తే, కూడా సమస్య వస్తుందని చెబుతున్నారు. ఒక వారంలో ఎలాంటి ఫెరఫార్మెన్స్ లేకున్నా కోట్లలో ఓట్లు రావడంతో బిగ్ బాస్ టీమ్ షాక్ తింది. దీంతో ఫేక్ ఓట్లమీద దృష్టి పెట్టింది.
ఒకే ఐపి ఎడ్రెస్ నుంచి రికార్డు స్థాయిలో ఓటింగ్ రావడం నకిలీ ఓట్ల కిందే లెక్క కడ్తున్నట్లు బిగ్ బాస్ టీమ్ తొలగిస్తున్న ఓట్లను బట్టి తెలుస్తోందని చెప్పవచ్చు. చాలా కఠినంగానే ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. పాత ఇమెయిల్ ఎడ్రెస్ నుంచి ఓట్లు నమోదయితే ఫర్వాలేదుగానీ కొత్తవాటినుంచి భారీగా ఓట్లు నమోదయేత్ వాటిని చెల్లని ఓట్లు గా పరిగణిస్తున్నారట. దీంతో బిగ్ బాస్ టీమ్ ఎంతగా అబ్జర్వ్ చేస్తోందో వేరే చెప్పక్కర్లేదు.
Author-Sandeep Reddy
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.